అది ఎమ‌ర్జెన్సీ డే కాదు రాజ్యాంగ హ‌త్యా దినం – బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి 

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    అది ఎమ‌ర్జెన్సీ డే కాదు ఇక నుంచి రాజ్యాంగ హ‌త్యా దినం అని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి అన్నారు. జూన్ 25 వ తేదీని ఎమ‌ర్జెన్సీ డే కాకుండా సంవిధాన్ హ‌త్యా దివ‌స్ గా కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుని గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం మాట్లాడుతూ… 1975 జూన్ 25వ తేదీ 50 ఏళ్ల ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కొంతమందికి ఇది ఒక పీడకల, కొంత మందికి జైలు జీవితానికి ఒక కారణమ‌న్నారు. 1975 నుండి 1977 వరకు మొత్తం 21 నెలలు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఈ అత్యవసర పరిస్థితి దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమ‌న్నారు.1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వర‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ను అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జారీ చేశారన్నారు. ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను చాలా మందిని జైలులో పెట్టారన్నారు. అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛ‌ను ఉల్లంఘించబడింద‌ని, ఆ సమయంలో వార్తా పత్రికలలో వచ్చే ప్రతి వార్త సెన్సార్ చేయబడిందన్నారు. లక్ష మందికి పైగా రాజకీయ నాయకులు, జర్న‌లిస్టులు, అసమాతులు, ఆర్ఎస్ఎస్‌ వంటి జాతీయవాదులను జైలులో పెడితే, పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో మీరు తెలుసుకోవచ్చ‌న్నారు. జనవరి 18, 1977న ఇందిరా గాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారని, ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుండి 20 వరకు దాదాపు 5 రోజుల పాటు జరిగాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 298 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుందన్నారు. మిత్రపక్షాలు 47 స్థానాలను గెలుచుకున్నాయన్నారు. భారత దేశ చరిత్రలో మొదటిసారిగా మొరార్జీ దేశాయ్ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ కూడా రాయ్‌బరేలిలో తన ప్రత్యర్థి రాజ్‌నారాయణ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారన్నారు. అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీని అత్యవసర పరిస్థితి గురించి గట్టిగా హెచ్చరించిందన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page