పరీక్షల సమయంలో చలాన్లతో విద్యార్థులను వేధించడం ట్రాఫిక్ పోలీసులకు తగదు
• తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బి నగర్ నియోజకవర్గం ఇంచార్జి బొంగు వెంకటేష్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ : పరీక్షల సమయంలో చలాన్లతో విద్యార్థులను వేధించడం ట్రాఫిక్ పోలీసులకు తగదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బి నగర్ నియోజకవర్గం ఇంచార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు పరీక్షల వేళ ట్రాఫిక్ పోలీసులకు చలాన్ల దందా చేస్తున్నారని, ట్రాఫిక్ చాలాన్ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కట్లను తెచ్చిపెడుతున్నారన్నారు. పరీక్ష కేంద్రం వద్ద తల్లిదండ్రుల బండ్లు ఆపి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులు బండి లిఫ్ట్ అడిగినా… ఏదైనా వస్తువు మర్చిన వాహనదారులు విద్యార్థులకు సహాయం చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను ఐదు నిముషాలు ఆలస్యం అయినా అనుమతించాలని కోరారు.
ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులను బండి ఆపి ఆర్‌సి, లైసెన్స్, హెల్మెట్, ఇన్సూరెన్స్ ఉన్నదా అని ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డు పైనే బండి ఆపి చాలాన్లు రాస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు తెలంగాణ రాజ్యాధికారం పార్టీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేస్తున్నారని అన్నారు. పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి ట్రాఫిక్ పోలీసులు బండి ఫోటోలు తీసి చలాన్లు ఇంటికి పంపిస్తున్నారని అంటున్నారని వెంకటేష్ గౌడ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు తమ పిల్లలను దూర ప్రాంతం నుండి తీసుకు వచ్చే విద్యార్థుల ప్రయాణం దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు అర్హత లేకపోయినా వాహనాల ఫోటోలు తీసి తమ అధికారుల మెప్పు కోసం.. ప్రభుత్వం ఖజానా నింపడం కోసం ట్రాఫిక్ పోలీసులు చలాన్ల రూపాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సేవాభావంతో తమ వంతు సహకరించుకోవాలని ఆయన కోరారు.














Leave a Reply