అంబర్‌పేట్, అద్దం న్యూస్ : కాచిగూడకు చెందిన తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోష్న ప్రతిష్టాత్మక టాప్–20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్టెన్స్ 2025 అవార్డును అమెరికాలోని వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హెల్ లో అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, వారి సంకల్పం, శక్తీకరణను ప్రోత్సహించే దిశగా 13 వ వార్షిక అమెరికన్ మల్టీ ఎద్నిక్ కమిషన్ ( ఏఎంఈసీ ) కాంగ్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా తెలుగు మహిళల బలాన్ని, ప్రతిభను, నాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానని ప్రొ.జోత్స్న అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ బలమైన వేదికను అందించి ప్రోత్సహిస్తున్నందుకు తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply