మాదేశి కళావతి రాజేందర్ ఆధ్వర్యంలో జ్యోతిబా ఫులే జయంతి
హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ : బీసీ సంక్షేమ సంఘం ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలు మాదేశి కళావతి, బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆనందేశి రాజేందర్ ( యూఎస్ఏ ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బండారు ప్రదీప్, గుండు శ్రీకాంత్, రాజు గౌడ్, టేకుల శివకుమార్, సంతోష్, కేబుల్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply