ముషీరాబాద్ డివిజన్‌లో కెసిఆర్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ : తెలంగాణ తొలి మాజీ సీఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బర్త్ డే వేడుకలు మంగళవారం ముషీరాబాద్ డివిజన్‌లో ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంటల రాజు, శ్రీనివాస్ యాదవ్, ఎండి.మోయిన్, శ్రీ శైలం యాదవ్ ల ఆధ్వర్యంలో జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు భాషపాక శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply