ఇసామియా బజార్ పేరుతో ఎన్నికలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు
కాచిగూడ, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : ఆరెకటిక సూర్యవంశీ సంగ్ ఇసామీయాబజార్ పేరుతో కోకాపేటలోని ఆరె కటిక ట్రస్ట్ సభ్యులు ఎన్నికలు నిర్వహిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని ఆరెకటిక సంఘ్ ఇసామియాబజార్ అధ్యక్షుడు హెచ్.రమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం నింబోలి అడ్డలోని ఏకే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2001 సంవత్సరంలో ఆరె కటిక సూర్య వంశీ సంగ్ ఇసామీయాబజార్ పేరుతో స్థాపించినట్లు పేర్కొన్నారు. తమ సంఘం 6233/2001 రిజిస్టర్ నంబర్ ప్రచురించి నేడు కోకాపేట ఆరెకటిక ట్రస్ట్ సభ్యులు ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఆ సంఘ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేడు నిర్వహించే ఎన్నికలను విరమించుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.చంద్రశేఖర్, సాయి సచితానంద్, బి.శంకర్, శ్యాంసుందర్, సతీష్, రఘునాథ్, జ్ఞానేందర్, రామ్మోహన్, రాజు, హరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply