శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు – అంగ‌రంగ వైభ‌వంగా శివ పార్వ‌తుల క‌ళ్యాణం

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు
» అంగ‌రంగ వైభ‌వంగా శివ పార్వ‌తుల క‌ళ్యాణం

ముషీరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోట శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. దేవునితోట శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యమంతా శివ‌ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగింది. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పల్లకి సేవ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అనంత‌రం లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజ‌ల‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ లు హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు.

 ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ శివుడికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలోని శివుడిని ద‌ర్ఙంచుకోవడానికి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ద‌ర్శ‌నానికి బారులుదీరారు. భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ఆల‌య అధికారులు అన్ని ఏర్పాట్ల‌ను చేశారు. ఆదివారం సాయంత్రం ఉప‌వాస దీక్ష ఉన్న భ‌క్తులు త‌మ ఉప‌వాస దీక్ష‌ను విర‌మించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య కార్యనిర్వాహణ అధికారి బి.జ్యోతి, ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ మేడి సురేష్‌, ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్‌, ఆలయ ధర్మకర్తలు లక్ష్మణ్, నీల్ చందర్, సూర్య చంద్రశేఖర్, సాయిబాబా, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page