హైదరాబాద్, సెప్టెంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా మైల్కోల్ మహేందర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాదవ సంఘాల రాష్ట్ర నాయకులు, గ్రేటర్ హైదరాబాద్‌లోని 52 స్థానిక యాదవ్ సదరు ఉత్సవాల కమిటీ సభ్యులు అందరూ కలిసి మహేందర్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా నియమితులైన మైల్కోల్ మహేందర్ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ…. ఈ సంవత్సరం అక్టోబర్‌లో నిర్వహించే దీపావళి సదర్ ఉత్సవాల నిర్వహణ కోసం 10 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. స్థానిక యాదవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్వాగత వేదికకు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల నగదు అందించాలని, బ్యాండ్ బాజా, డప్పు చప్పుళ్లతో దున్నలను చక్కగా అలంకరించి వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి సదర్ ఊరేగింపు నిర్వహించే నిర్వాహకులకు లక్ష రూపాయలు నగదు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో సదర్ నిర్వహించే ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా మహిళలకు ప్రభుత్వం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, సదర్ స్వాగత వేదిక వద్ద కమిటీ నిర్వాహకులు గోవు పూజ నిర్వహించాలన్నారు. సదరు ఉత్సవాల కొరకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. తన పై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా ఎన్నుకున్న యాదవ సంఘాల రాష్ట్ర నాయకులకు, గ్రేటర్ హైదరాబాద్‌లోని 52 స్థానిక యాదవ సంఘాల సదర్ ఉత్సవాల కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మహేందర్ యాదవ్ చెప్పారు. సంఘంలో మార్క రమేష్ కుమార్ యాదవ్ చురుకుగా పాల్లొంటూ అందరికి కలుపుకొని వెళ్తున్నారన్నారు. రమేష్ కుమార్ యాదవ్‌కు మంచి భవిష్యత్ ఉందన్నారు. రానున్న రోజుల్లో రమేష్ యాదవ్‌కు మంచి పదవులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా నియమితులైన మైల్కోల్ మహేందర్ యాదవ్ రానున్న రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలని కోరారు. మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply