ఈ నెల 19 న‌ ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి – అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న

ఈ నెల 19 న‌ ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

– అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న


హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :    దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నుండి ప్రజల మౌలిక సమస్యలు పక్కకు పెట్టి, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజా సంపద దోచిపెట్టే పనిలో ఉన్నారని…. కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చిందని దీనిని వ్యతిరేకించాలని అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న గురువారం ఒక ప్రకటనలో కోరారు. బిజెపి ప్రభుత్వ మోడీ, అమిత్ షా లు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ వారిని అడవుల నుండి వెళ్ళగొట్టి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా జరుపుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని స్వప్న డిమాండ్ చేశారు. కవులు, కళాకారులు కళల రూపంలో, పాటల రూపంలో ప్రజలను చైతన్యం చేయాలని, అమాయక గిరిజన ప్రజలని ఎన్‌కౌంట‌ర్ పేరుతో చంపుతున్నారని, ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటంలో అరుణోదయ సంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 19 న ఇల్లందులో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలనే నినాదంతో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఆమె కోరారు.


 

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page