
జలమండలి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 21 అద్దం న్యూస్ : జలమండలి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సీజీఎం(పి అండ్ ఏ) గా పనిచేస్తున్న ఆయన డైరెక్టర్ (పర్సనల్)గా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డిని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సన్మానించిన టీజీవో నేతలు :
జలమండలి డైరెక్టర్ ( పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ) గా పదోన్నది పొందిన సందర్భంగా మహ్మద్ అబ్దుల్ ఖాదర్‌ను టీజీఓ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా తరపున అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్ సన్మానించారు. ఈ సందర్బంగా కృష్ణయాదవ్ మాట్లాడుతూ… కొత్త పదవిలో రాణించాలని, జలమండలికి సేవ చేయుటలో కృతకృత్యుడవ్వాలని, చేబట్టే ప్రతిపని విజయవంతమవ్వాలని శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సహాయ అధ్యక్షుడు ఆశన్న, కోశాధికారి ఎంవి.రమణ, జాయింట్ సెక్రటరీ శ్రీరామ్, డాక్టర్ రమేష్, డాక్టర్ కోటాజీ, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జె.రవికుమార్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ క్రోత విద్యా సాగర్, డాక్టర్ సునీతా జోషి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply