Seema Punia : అథ్లెట్‌కు బిగ్ షాక్.. 16 నెలల నిషేధం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: స్టార్‌ డిస్కస్‌ త్రో అథ్లెట్ సీమా పునియాకు షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై 16 నెలల నిషేధం విధిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) నిర్ణయం తీసుకుంది. పునియాపై సస్పెన్షను నవంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అయితే, పునియా ఏ ఉత్ర్పేరకం వాడిందో మాత్రం నాడా తెలియజేయలేదు. ఇది ఆమె కెరీర్‌లో రెండోసారి నిషేధం ఎదుర్కోవడం కావడం గమనార్హం.

జూనియర్ స్థాయిలో డోపింగ్‌ టెస్టులో విఫలమై నిషేధం ఎదుర్కొంది. పునియా చివరిసారిగా 2023లో ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగింది. ఆ పోటీల్లో రజత పతకం సాధించింది. నాలుగుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతగా నిలిచింది. ఇప్పుడీ నిషేధంతో ఆమె కెరీర్‌ దాదాపు ముగిసిపోయినట్లేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page