తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో కొత్త పార్టీ

తెలంగాణలో
మరో కొత్త రాజకీయ పార్టీ శ్రీకారం

తెలంగాణ బ్యూరో, ఫిబ్రవరి 20, అద్దం న్యూస్ :    తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, నేపథ్యంలో కొత్త ఆలోచనలు, ప్రత్యామ్నాయ రాజకీయ నినాదంతో ఈ పార్టీ రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. వ‌చ్చే నెల మార్చిలో ఈ కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రజా సమస్యలే అజెండాగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. యువత, మధ్యతరగతి, రైతులు, ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తూ కొత్త పార్టీ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలిసింది. అవినీతి రహిత పాలన పారదర్శకత, స్థానిక సమస్యలకు ప్రాధాన్యం, అనే అంశాలను ప్రధాన నినాదాలుగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. త్వరలో పార్టీ పేరు జెండా, ఎజెండా, సిద్ధాంతాలతో పాటు అధికారిక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా సమావేశాలు, ప్రజా చర్చలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

     హైద‌రాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ కొత్త పార్టీ రాజకీయ సమీకరణలపై ఎంత వరకు ప్రభావం చూపుతోందోనని ఇతర పార్టీలలో ఆసక్తికరం పెరిగింది. ఇప్ప‌టికే పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేప‌ధ్యంలో రానున్న మార్చిలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో నూత‌న పార్టీ, మే నెల‌లో క‌విత కొత్త పార్టీ ఏర్పాటు చేయ‌నున్న నేప‌ధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీల ఏర్పాటు పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో కొత్త పార్టీ అంటే ఇత‌ర పార్టీల‌తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఒక న‌జ‌ర్ వేసిన‌ట్లు తెలుస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page