చిక్క‌డ‌ప‌ల్లిలో ఎన్‌టిఆర్ జ‌యంతి వేడుక‌లు

                                           ఎన్‌టిఆర్ ఘాట్‌లో నివాళుల‌ర్పిస్తున్న బాల్‌రాజ్‌గౌడ్

హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త ఎన్‌టి.రామారావు జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా జ‌రిగాయి. బుధ‌వారం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ హాజ‌రై ఎన్‌టిఆర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. అనంత‌రం పేద‌ల‌కు పులిమోర ప్యాకెట్ల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ… ఎన్‌టిఆర్ తెలుగు ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం తెచ్చార‌న్నారు. తెలంగాణ‌లో టిడిపి పుట్టింద‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఎన్‌టిఆర్ చేసిన అభివృద్ధే నేటికి క‌నిపిస్తుంద‌న్నారు. ఎన్‌టిఆర్‌కు భార‌త‌ర‌త్నను ఇవ్వాల‌న్నారు. అనంత‌రం ఎన్‌టిఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు డి.చంద్ర‌మోహ‌న్‌గౌడ్, ఉద‌య్ కుమార్ గుప్త‌, శంక‌ర్‌, గోపాల్‌, శివ‌కృష్ణ‌, సాయి, పుల్ల‌య్య, నాయుడు, అన్న‌పూర్ణ‌, వీణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page