అధికారులు సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి – కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి

– కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్



హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ :    అన్ని విభాగాల ప్రభుత్వాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ సూచించారు. సోమ‌వారం కార్పొరేటర్ కార్యాలయంలో అధికారులతో కార్పొరేట‌ర్ పావ‌ని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటర్ వ‌ర్క్స్‌ డిజిఎం కార్తీకరెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సివరేజ్, మంచినీటి పైప్‌లైన్ల‌ నిర్మాణ పనులు విషయంలో వాటర్ వ‌ర్క్స్‌, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం మధ్య సమన్వయలోపం కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోకుండా చూసుకోవాలని సూచిస్తూ డివిజన్ కార్పొరేటర్ పావ‌ని విన‌య్ కుమార్ సూచించారు. సివరేజ్, మంచినీటి పైప్‌లైన్ల‌ నిర్మాణం సందర్భంగా రోడ్డు కటింగ్ చేయాల్సి వస్తుందని ఈ నేపథ్యంలో రోడ్డు కటింగ్ పర్మిషన్ తీసుకోలేదంటూ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఫిర్యాదు చేయడం వంటి అంశాలు జరుగుతున్నాయని, అలా కాకుండా సమన్వయంతో రెండు విభాగాలు పని చేయాలని ప్రజాభివృద్ధి అమలు విషయంలో సహకరించి డివిజన్ అభివృద్ధిలో అధికారులు కూడా భాగస్తులు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎ.విన‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page