తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై
త్వరలో లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర
– డా.విశారదన్ మహారాజ్
అంబర్పేట్, అద్దం న్యూస్ : తెలంగాణ 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడిత వర్గాలకు రాజ్యాధికారం కోసం
ప్రజలను చైతన్యపరిచి అగ్రకుల కాంగెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నుండి వారిని విముక్తి కలిగించడానికి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాను లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగెల దుర్గ ప్రసాద్లో కలిసి మాట్లాడారు. కుల గణనలో కేవలం ఐదు శాతమే రెడ్లు ఉన్నారని, 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఉన్నారని స్పష్టమైందని తెలిపారు. 5 శాతం ఉన్న రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోయి 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రాజకీయ రంగాలలో 80 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నింటిని ప్రజలకు వివరించి కాంగ్రెస్ బంధీఖాన నుండి ప్రజలను విముక్తి కలిగిస్తామన్నారు. బిజెపి, బీఆర్ఎస్ ఆధిపత్యం నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి రథయాత్రను చేపడుతున్నట్లు వివరించారు.

బడ్జెట్లో 30 శాతం నిధులను విద్యకు, 30 శాతం వైద్య రంగానికి నిధులను ఉపాధి రంగానికి కేటాయించాలన్నారు. మా భూమి రథయాత్ర తెలంగాణలోని 33 జిల్లాలు, 612 మండలాలు, 12 వేల గ్రామాలలో మూడున్నర కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను చైతన్యం చేస్తామని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమ వ్యక్తం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply