...

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత – తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రాత్మక విజయం !

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత – తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రాత్మక విజయం !
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టికి దక్కిన అద్భుత గౌరవం
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ :  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి భారత పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ( TTDP ) సికింద్రాబాద్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు హర్షం వ్యక్తం చేశారు. మన జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు రాజీలేని పోరాటానికి, అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గొప్ప గౌరవంగా వారు అభివర్ణించారు. ఈ సందర్బంగా హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడిద‌న్నారు. అదే స్ఫూర్తితో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక అద్భుతమైన రాజధాని ఉండాలనే సంకల్పంతో అమరావతిని ఎంచుకున్నారన్నారు. నేడు పార్లమెంట్ సాక్షిగా ఆ నిర్ణయానికి చట్టబద్ధత లభించడం చంద్రబాబు దూరదృష్టికి, విజన్ కి నిదర్శనమ‌ని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ ను నిర్మించిన మా నాయుకుడు, నేడు అమరావతి నగరంతో మరో మైలురాయి సాధించారని తెలిపారు.

రాజధానిపై ఇక ఎలాంటి సందిగ్ధత లేకుండా, భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వం కూడా మార్చడానికి వీలులేని విధంగా చట్టబద్ధమైన రక్షణ లభించడం శుభ పరిణామం అని అన్నారు. రైతుల త్యాగం మరియు 1630 రోజులు ప్రజలు పోరాడి సాధించుకున్న విజయం అని కొనియాడారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను స్వ‌చ్ఛందంగా ఇచ్చిన అమరావతి రైతుల త్యాగం వృధా పోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 సవరణ బిల్లును ప్రవేశపెట్టి, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు తెలంగాణ టీడీపీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు, అని అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. అమరావతి అభివృద్ధి చెందితే, పొరుగు రాష్ట్రంగా తెలంగాణకు కూడా ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో అమరావతి ఒక కీలక చోదక శక్తిగా మారబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర జి.అనిల్ కురుమ, తడక వినోద్, పరుశురామ్, భాను ప్రకాష్, సుక్రవేది, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.