అంబర్‌పేట్, అద్దం న్యూస్ : కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ముందస్తు జాగ్రత్తతో కుష్టు వ్యాధిని నయం చేయవచ్చని ప్రభుత్వ కుష్టు వ్యాధి ట్రైనింగ్ సెంటర్ ( నల్లకుంట ) ఎస్ఎంఓ డాక్టర్ సుజాత అన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ ను ఎస్ఎంఓ.డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో సిబ్బందితో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎంఓ డాక్టర్ సుష్మా లక్ష్మి, రాష్ట్ర ఎస్ఎల్ ఓ డాక్టర్ బి.జాన్ బాబు, జిఎల్ సిటిసి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply