పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి – వ‌క్త‌లు

పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి
– వ‌క్త‌లు

హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ :   పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, స్మారక సంస్థ ఆధ్వ‌ర్యంలో 105 వ జాతీయ ప‌తాక ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ బుధ‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలు దివంగ‌త కెహెచ్ఎస్.జగదంబ స్థాపించిన ప్రధాన కార్యాలయంలో జ‌రిగిన జాతీయ జెండా 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ట్రస్ట్ చైర్ పర్సన్ కోడూరు శ్రీదేవి ఆధ్వర్యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గోవింద అశోక్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేతుల మీదుగా 300 మంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా అశోక్ మాట్లాడుతూ… పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో దాతలు సత్యం, క్రికెటర్ లక్కరాజు సురేష్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి, కేశ‌వ్‌, మేడి స‌త్య‌నారాయ‌ణ‌, పింగళి వెంకయ్య స్మారక సంస్థ చైర్పర్సన్ – కోడూరు శ్యామల్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బంగారు ప్రశాంత్, కార్య‌ద‌ర్శి సుధాకర్ రెడ్డి, ట్ర‌స్టీలు ప్ర‌సునాంబ‌, బిహెచ్‌.రుక్మిణి, కరణం సురేష్, విజయ్ యాదవ్, పి.లక్ష్మణ్, కె.వెంకటేష్, కె.శ్రీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page