హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) : నగర నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృష్ణా, గోదావరి, మంజీరా, ఉస్మాన్‌సాగర్ తదితర ప్రధాన జలవనరులను పరస్పరం అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాజాగూడ ఎక్స్‌రోడ్స్ వద్ద ఇటీవల పూర్తిచేసిన 900 ఏంఏం డయా పైప్‌లైన్ జంక్షన్‌ను ఎండీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను ప్రశాసన్‌నగర్ వరకు తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఏదైనా ఒక జలవనరు లేదా ప్రధాన పైప్‌లైన్‌కు షట్‌డౌన్ ఏర్పడినప్పుడు మరో వనరు నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేసేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లోనూ నీటి సరఫరాలో అంతరాయాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జీఎం, డీజీఎం, మేనేజర్, జలమండలి సిబ్బంది, సీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాన జలవనరుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
RELATED ARTICLES
