హైదరాబాద్, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) : దుబాయ్ నుండి ఇజ్రాయెల్ టెల్ అవీస్ వెళ్తున్న విమానంలో కో`పైలట్ దాడి జరిపి విమానం కూల్చివేతకు పన్నిన కుట్రను ఎంతో సమయస్ఫూర్తితో ఎదుర్కొని 170 కి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి, తన పై భౌతిక దాడి జరుగుతున్నా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో నిబ్బరంగా హనుమాన్ చాలీసాను పఠిస్తూ కాక్ పిట్ తలుపు తెరిచి మిగతా ప్రయాణీకుల స్పందనతో ఘోర ప్రమాదాన్ని తప్పించి గాయాలైన స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ కవాడిగూడలోని సంకట విచోచన హనుమాన్ దేవాలయంలో స్మిత్ మచ్చర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజా, అర్చన తదితర పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. స్మిత్ మచ్చర్ తెగువ, ధైర్యం దేశానికి గర్వకారణం ప్రపంచ దేశాలు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే వారు భారతీయులు అని శ్లాఘిస్తాయన్నారు.
స్మిత్ మచ్చర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజా, అర్చన
RELATED ARTICLES
