Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADఉచిత వైద్య శిబిరాల‌ను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

ఉచిత వైద్య శిబిరాల‌ను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

📰 Generate e-Paper Clip

రామ్‌గోపాల్ పేట్‌, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) :    పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్‌న‌గ‌ర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంగోపాల్ పేట్ డివిజ‌న్‌లోని నల్లగుట్ట అభివృద్ధి సంఘం హాల్‌లో అప్సా స్వచ్ఛంద‌ సంస్థ, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హాజ‌రై శిబిరాన్ని ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు 150 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్ష‌లు చేసి, ఆరోగ్య సలహాలను, మందులు అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం.శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్‌లను చూపించారు. డాక్టర్ శివకుమార్ లాల్, డాక్టర్ ఎస్.జయ దంత పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నర్సింహ మూర్తి, వెంకట్, అప్సా సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ ఎం.బస్వరాజ్, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బి.రమేష్, జి.మంజుల, సిబ్బంది, నల్లగుట్ట అభివృద్ధి సంఘం ప్రతినిధులు గున్నాల నరేష్, యశ్వంత్ రావు, సురేష్, రాజు, గంగరాజు, జనహిత క్యాంపు కో–ఆర్డినేటర్ బి.నర్సింగ్ రావు, కిమ్స్ ఫౌండేషన్ కో–ఆర్డినేటర్ జె.విక్రమ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page