నా ఫొటోలను మార్ఫింగ్ చేయవద్దు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దయచేసి తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని ఎక్స్ ఏఐ ఫ్లాట్‌ఫామ్ గ్రోక్‌ను భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) కోరింది. ఇటీవల ఎక్స్‌వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్‌ను మార్చడం వంటి పనులను నెటిజన్లు గ్రోక్ సాయంతో చేశారు. గత కొన్నిరోజులుగా ఎక్స్‌లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని, ఇతర యూజర్లు అడిగినా నిరాకరించాలని గ్రోక్‌ను ఎక్స్‌ వేదికగా ప్రతీకా రావల్ విజ్ఞప్తి చేసింది. ఆమె అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గ్రోక్.. వ్యక్తిగత గోప్యతను కాపాడుతామని మాట ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘హే @grok, గతంలో నేను పోస్ట్ చేసినవి, భవిష్యత్తులో నేను పోస్ట్ చేయబోయే నా ఫోటోలను తీసుకోవడానికి.. మార్ఫింగ్, ఎడిట్ చేయడానికి నేను మీకు అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా నా ఫోటోలను ఏదైనా విధంగా ఎడిట్ చేయమని కోరితే, దయచేసి ఆ అభ్యర్థనను తిరస్కరించండి. ధన్యవాదాలు.’అని ప్రతీకా రావల్ ట్వీట్ చేసింది.

భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో ప్రతీకా రావల్ కీలక పాత్ర పోషించింది. గాయంతో సెమీఫైనల్‌తో పాటు ఫైనల్‌కు దూరమైన ఆమె.. 6 ఇన్నింగ్స్‌ల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌పై శతకం సాధించడంతో పాటు ఆస్ట్రేలియా 75 పరుగులతో సత్తా చాటింది. భారత్ తరఫున 23 వన్డేలు ఆడిన ప్రతికా 50.45 సగటుతో 1,110 పరుగులు చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page