ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించండి – ఎమ్మెల్సి మ‌ల్ల‌న్న‌ను కోరిన‌ ఆరె క‌టిక‌ల అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు అశోక్ దాదా

ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించండి

– ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్నను కోరిన‌ ఆరె క‌టిక‌ల అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు అశోక్ దాదా

హైదరాబాద్, ఆగ‌స్టు 30, అద్దం న్యూస్ :    ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూంప‌ల్లి అశోక్ కుమార్ జి దాదా కోరారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆరె కటిక హక్కుల సాధన కోసం కవి, గాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన భూంప‌ల్లి అశోక్ కుమార్ జి దాదా, జాయింట్ సెక్ర‌ట‌రి జ‌మాల్‌పూర్ శ్రీనివాస్ దాదా లు ఎమ్మెల్సి తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూంప‌ల్లి అశోక్ కుమార్ జి దాదా మాట్లాడుతూ…సారా వృత్తి మాది … మటన్ వృత్తి ఆరె క‌టిక‌ల‌ద‌న్నారు. ఆరు డిమాండ్లతో ఎక్సైజ్ పాలసీలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడిన మెమోరండాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఇచ్చామ‌న్నారు. ఇందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సానుకూలంగా స్పందించి మండలిలో గొంతు వినిపిస్తానని, సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాన‌ని హామి ఇచ్చార‌ని అశోక్ తెలిపారు.  తర్వాత క్యూ న్యూస్ సుదర్శన్, లైవ్‌లో అరెకటికల సమస్యలు, ఎక్సైజ్ పాలసీలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరెకటిక అభివృద్ధి సంఘం సోషల్ మీడియా కన్వీనర్ కామ్లేకర్ వెంకటేశ్వర్ జి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page