ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సిఐగా రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా రాజగోపాల్ రెడ్డి గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శాంతి భద్రతలను సంరక్షించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలందరిని కలుపుకొని ముందుకెళ్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నేరాలను అదుపు చేయడంలో ప్రజలు, యువజన సంఘాలు, బస్తీ, కాలనీ సంఘాల సహకారం ఉండాలన్నారు.














Leave a Reply