రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కాన్ని స‌క్ర‌మంగా అమ‌లు చేయాలి – తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ్డ యాద‌య్య మాదిగ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కానికి నిధుల‌ను కేటాయించి స‌క్ర‌మంగా అమ‌లు చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ్డ యాద‌య్య మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కం పై రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. గురువారం జ‌రిగిన ఈ స‌మావేశానికి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ్డ యాద‌య్య మాదిగ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశానికి బంధు సొసైటీ అధ్య‌క్షుడు ప‌ల్లెల వీర‌స్వామి, లాయ‌ర్ మ‌ల్ల‌న్న‌, క‌ల్లెప‌ల్లి ల‌క్ష్మీ నారాయ‌ణ‌, కొండ్రు పురుషోత్తం, బిఎన్‌.రాంచంద‌ర్ రావు, క‌ల్యాణి, మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) ముషీరాబాద్ క‌న్వీన‌ర్ క‌ల్ప‌న‌, జ‌య‌ల‌క్ష్మీ, ప్ర‌కాష్ వాగ్‌వారే, ముంజ‌గ‌ల్ల విజ‌య్ కుమార్‌, ప్రొఫెస‌ర్ న‌తానియ‌ల్‌, ప్రొఫెస‌ర్ ఏకు తిరుప‌తి, హెచ్ఆర్‌.మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

                             ఈ సంద‌ర్భంగా తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ్డ యాద‌య్య మాదిగ మాట్లాడుతూ… మాదిగ సమాజానికి నిర్ధారిత కోటాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం, విద్యా, ఆర్థిక సహాయం వంటి అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని సంఘం డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా బలహీనవర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, మాదిగ‌ సమాజ హక్కులను ఖచ్చితంగా రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను పాత నియామక నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేసి, మాదిగ‌ వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విద్యార్హతలతో పాటు వృత్తి శిక్షణ, స్టార్టప్ మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. మాదిగ సమాజానికి న్యాయమైన హక్కులు, సంక్షేమ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేక‌పోతే ఆందోళనాత్మక ప‌రిణామాలు త‌లెత్తుతాయ‌ని సంఘం అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ‌ హెచ్చరించారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page