అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్

– గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగ‌స్టు 09, అద్దం న్యూస్ :    అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ అని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. రాఖి పండుగ సందర్భంగా శనివారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డివిజన్‌లోని పలువురు సోదర సమానులైన బీజేపీ నేతలకు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ మోర్చ నాయకుడు మొహమ్మద్ మహమూద్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయ్‌రామ్‌రెడ్డిల‌కు కార్పొరేట‌ర్ పావ‌ని రాఖి కట్టారు. నీవు నాకు రక్షా…నేను నీకు రక్షా…మనం దేశానికి రక్షా అందుకు ఈ రాఖీ నిదర్శనం అని కార్పొరేటర్ పావ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నాయకులు నర్సింహ, ప్రశాంత్ పలువురు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page