హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం భోలక్‌పూర్‌లోని బడీమసీదుతో పాటు పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా, గౌరీ శంకర దేవాలయం మాజీ ఛైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పులిగిల్ల శ్రీధర్‌చారి, డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, వీరేశం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలయ్ బలయ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా షీర్ ఖుర్మాను తినిపించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply