మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించండి – లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ముందు ఆందోళన చేపడతాం – కార్పొరేట ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ :   డివిజ‌న్‌లో మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాల‌ని, లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ఎదుట ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆందోళన చేపడతామ‌ని గాంధీన‌గ‌ర్‌ కార్పొరేట ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డితో బుధ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని అనేక బ‌స్తీల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా లో ప్రెష‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతున్నార‌ని, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… గత కొంత కాలంగా డివిజన్ వ్యాప్తంగా ప్రజలకు తీవ్రతరంగా మారిన మంచినీటి లోటును పరిష్కరించాలని ఎండి అశోక్‌రెడ్డిని కోరామ‌న్నారు. పలు మార్లు మంచినీటి లో ప్రెషర్ సమస్య పై జలమండలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమ‌న్నారు. ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్ లు ఎండి అశోక్‌రెడ్డితో స‌మస్య వివరాలపై చర్చించారని గుర్తు చేశారు. కావున వెంటనే వాట‌ర్ వ‌ర్క్స్‌ అధికారులకు ఆదేశాలు జారీ మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని అన్నారు. లేక‌పోతే డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేస్తామని కార్పొరేటర్‌ పావ‌ని చ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page