సికింద్రాబాద్‌కు చెందిన సచిన్ కు దళిత రత్న అవార్డు ప్రదానం
సికింద్రాబాద్, మే 3, అద్దం న్యూస్ : సికింద్రాబాద్‌కు చెందిన యు సచిన్ కు దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు శనివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ కులాల హక్కుల రక్షణ పోరాట అధ్యక్షుడు రాజు ఉస్తాద్ అవార్డును ప్రదానం చేశారు. బౌద్ధ నగర్‌లో నివాసం ఉంటున్న సచిన్ దళిత కులాల హక్కుల రక్షణ పోరాట సమితి యూత్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ భావజాలంతో రాజ్యాంగ పరిరక్షణ, దళితుల ఐక్యత కోసం విశేష కృషి చేస్తున్నారు. సచిన్ సేవలను గుర్తించిన జాతీయ దళితుల హక్కుల రక్షణ పోరాట సమితి దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసిన ఎంపిక చేశారు. తన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డును ప్రదానం చేయడం తనపై మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించడంలో… అదే విధంగా దళితుల హక్కుల పరిరక్షణ, ఐక్యత కోసం కృషి చేస్తానన్నారు. తనకు అవార్డు ప్రదానం చేసిన జాతీయ అధ్యక్షుడు రాజు ఊస్తాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply