సంగ‌మేశ్వ‌ర ఆల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం

సంగ‌మేశ్వ‌ర ఆల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం

సంగ‌మేశ్వ‌ర ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా వెంక‌టేష్‌గౌడ్‌



హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లో ప్ర‌సిద్ది చెందిన సంగ‌మేశ్వ‌ర దేవాల‌యం నూత‌న ద‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా బిసి వెంక‌టేష్ గౌడ్‌, ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ర‌జినీకాంత్‌, ర‌వి, వినోద్ గౌడ్, శ్రీనివాస్‌, ల‌క్ష్మీ, చంద్ర‌శేఖ‌ర్ లు ఎంపిక‌య్యారు. వారితో రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, ఈవో ల‌క్ష్మారెడ్డి, దేవాదాయ‌శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ ఆండాలు నూత‌న క‌మిటీ స‌భ్యుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల క‌మిటీని ఎంపి అనిల్ ఘ‌నంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్ర‌భుత్వం దేవాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆల‌యాల అభివృద్ధికి కృషి చేస్తుంద‌న్నారు. నూత‌న క‌మిటీ స‌భ్యులు సంగ‌మేశ్వ‌ర దేవాల‌యం అభివృద్ధి కోసం కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పాశం అనిల్ కుమార్ యాద‌వ్‌, అన్న‌ల్‌దేశ్ న‌ర్సింహా , ర‌ఘు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page