మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది
– హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, జనవరి 3, అద్దం న్యూస్ : మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలు హైదరాబాద్ రాంనగర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ…. మహిళల విద్య, సామాజిక సంస్కరణల కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు అనన్యసాధారణమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, విద్య ద్వారా మార్పు సాధ్యమని సావిత్రిబాయి ఫూలే నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్.శిల్పారెడ్డి, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు పావని వినయ్ కుమార్, వై.అమృత, కన్నె ఉమా రమేష్ యాదవ్, కొంతం దీపిక నరేష్, కెతినేని సరళ, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్, ఇతర ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply