ఎస్‌జి సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి – నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ పొట్ట‌పెంజ‌ర ర‌మేష్‌

హైదరాబాద్, జూన్ 1, అద్దం న్యూస్ :              తమ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి, కోట్ల రూపాయలు దండుకున్న ఎస్‌జి ఎంటర్‌ప్రైజెస్ నిర్వా హకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నేషనల్ కన్జ్యూమ‌ర్ క‌మిషన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ పొట్ట‌పెంజ‌ర ర‌మేష్‌, డిప్యూటీ చైర్మన్ తికుంట్ల‌ విశాల్ లు డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ… ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేట‌ర్‌గా పనిచే స్తున్న ముత్తినేని లక్ష్మీప్రసన్న, త‌న అసిస్టెంట్ అయిన‌ సజ్జ సతీష్, వాసిరెడ్డి గౌతమి పేరు మీద ఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీని ఏర్పాటు చేసి, మోసం చేశారన్నారు. సజ్జ సతీష్, వాసిరెడ్డి గౌతమి, నాగ సృజ‌న లు మన్సూరాబాద్‌కు చెందిన సుమన్, స్వాతి భార్యా భర్తల నుంచి దాదాపు రూ.50 లక్షలను ఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ లో డిపాజిట్ చేయించి, అధిక లాభాలు ఇస్తామ‌ని 2023 జున్ నుంచి 2024 జ‌న‌వ‌రి వ‌ర‌కు డిపాజిట్ చేయించి, మోసం చేశారని ఆరోపించారు. మూడు నెల‌ల్లోనే ల‌క్ష‌న్న‌ర లాభం వ‌చ్చింద‌ని.. మీ అకౌంట్‌లో వేశామ‌ని చెప్పగానే సుమ‌న్‌, స్వాతి దంప‌తులు సంతోష‌ప‌డ్డారని తెలిపారు. దీంతో అప‌ర్ణ‌, వాసిరెడ్డి గౌత‌మి, నాగ‌సృజ‌న త‌దిత‌రులు సుమ‌న్‌, స్వాతి దంప‌తుల‌తో మ‌రింత పెట్టుబ‌డి పెట్టించార‌న్నారు. అందుకోసం సుమ‌న్‌, స్వాతి దంప‌తులు ఒంటి మీద ఉన్న బంగారం అమ్ముకుని, వారిక తెలిసిన వారితో కూడా ఇన్వెస్ట్ చేయించారని పేర్కొన్నారు. కొన్ని రోజుల త‌ర్వాత మోసపోయామ‌ని గుర్తించిన సుమ‌న్‌, స్వాతి లు శాఖ‌మూరి శ్రీధ‌ర్‌ను ప‌ట్టుకుని స‌జ్జ స‌తీష్ ఇంటికి వెళ్లారని, డ‌బ్బులు తీసుకొని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పారిపోయింద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని వ‌న‌స్థ‌లిపురం పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారన్నారు. న‌గ‌ర పోలీస్ క‌మిషన‌ర్‌తో పాటు డిజిపిలు స్పందించి బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page