ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా సిరిగిరి శ్యామ్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారులు సిరిగిరి శ్యామ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కాన్ని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ ( ఢిల్లీ ) జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.ఎంయు. దువ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సిరిగిరి శ్యామ్ విలేక‌రుల‌తో మాట్లాడుతుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా నియ‌మించినందుకుగాను జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.ఎంయు.దువ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత రోజుల్లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ప్ర‌తి చోట జ‌రుగుతూనే ఉంద‌న్నారు. అనేక మంది పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ ఉంటుంద‌న్నారు. నేడు స‌మాజంలో చిన్నారుల పై అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌ని, కొంత మంది కొడుకులు వారి వారి త‌ల్లిదండ్రుల‌ను రోడ్డున‌ప‌డ‌వేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంద‌రికి స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, వివ‌క్ష లేకుండా ఉండే హ‌క్కు ఉండాల‌ని, స‌మాన‌త్వంతో ప్ర‌జ‌లంద‌రూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డానికి హ్యుమ‌న్ రైట్స్ ప‌ని చేస్తుంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రికి మాన‌వ హ‌క్కుల గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని శ్యామ్ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page