Sunday, September 20, 2026
No menu items!
HomeGREATER HYDERABAD• మేద‌ర్ బ‌స్తీ, న్యూ అచ్చ‌య్య‌న‌గ‌ర్ బ‌స్తీల్లో మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి ...

• మేద‌ర్ బ‌స్తీ, న్యూ అచ్చ‌య్య‌న‌గ‌ర్ బ‌స్తీల్లో మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి • చిల‌క‌ల‌గూడ వాట‌ర్‌వ‌ర్క్స్ కార్యాల‌యం ఎదుట‌ ధ‌ర్నా

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ మేద‌ర్ బ‌స్తీ, న్యూ అచ్చ‌య్య‌న‌గ‌ర్‌ల్ల‌ల్లో గ‌త కొన్ని రోజులుగా మంచినీటి స‌ర‌ఫ‌రా రావ‌డంలేద‌ని, వెంట‌నే మంచినీటి స‌ర‌ఫ‌రా చేయాల‌ని బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ డిమాండ్ చేశారు. రాంన‌గ‌ర్ డివిజ‌న్ మేద‌ర్ బ‌స్తీ, న్యూ అచ్చ‌య్య‌న‌గ‌ర్‌ల్ల‌ల్లో మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేస్తూ శ‌నివారం చిల‌క‌ల‌గూడ వాట‌ర్‌వ‌ర్క్స్ కార్యాల‌యం వ‌ద్ద గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో బ‌స్తీవాసులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మేద‌ర్‌బ‌స్తీలో ప‌వ‌ర్ బోరు పాడై నెల‌లు అవుతుంద‌ని ఫిర్యాదులు చేసినా మ‌ర‌మ్మ‌తులు చేయిస్తాం అంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. దానికితోడు బ‌స్తీల్లో నాలుగు రోజులుగా మంచినీటి స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డం వ‌ల్ల ఆయా బ‌స్తీవాసులు ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. వెంట‌నే మంచినీటి స‌ర‌ఫ‌రాను ఇవ్వ‌క‌పోతే బిజెపి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. ఈ ధ‌ర్నాలో బ‌స్తీ మ‌హిళ‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page