Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADబీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది – తెలంగాణ రక్షణ సేన...

బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :    బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని, కేంద్రం చేసే జనగణనలో బీసీ ఉప కులాలను కూడా కలిపి లెక్కించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కులం కోసం ప్రత్యేక కాలం ప్రత్యేకంగా ఉండాల్సిందే అని, కుల గణనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది.. కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. మన ఆలోచన విధానం మారితేనే కుల వివక్ష నిర్మూలన సాధ్యం అవుతుంద‌న్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో నిర్వహించిన ‘‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’’ సదస్సు జ‌రిగింది. ఈ స‌దస్సుకు క‌విత హాజ‌రై మాట్లాడారు. దేశంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లైనా కూడా కుల వివక్ష తప్పటం లేదన్నారు. రాష్ట్రపతి, స్పీకర్ సహా ఎంతో మంది పెద్దస్థానాల్లో ఉన్న వాళ్లు కుల వివక్షకు గురవటం మనం చూశామ‌ని, ఇంకా మనకు తెలియకుండా దేశంలో లక్షలాది మంది రోజు ఈ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం చూస్తే లంబాడాలకు ఇళ్లు ఇవ్వమంటూ ఎవరో బోర్డు పెట్టారన్నారు. కులాన్ని బట్టి ఇళ్లు ఇవ్వమని చెప్పటం ఎంత దారుణమో అర్థం చేసుకోవాలని, ఫండల్ మెంట్ గా ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే ఈ బాధలు ఉండవన్నారు. దేశంలో ఒకే కులానికి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టేటస్ ఉందని, ఉపకులాలను కూడా లెక్కించకపోతే ఆయా కులాల జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు చూపే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

మా కులమైన వెల్మ కులం ఏపీలో మూడు ఉప కులాలుగా ఉందని.. కేంద్ర చేసే కులగణనలో ఒకే కాలం పెడితే ఉపకులాలుగా ఉండే వారి లెక్క వేరే ఉండి అవి మరో కులంగా మారుతుందన్నారు. దాని కారణంగా కులాల జనాభా తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రం చేస్తున్న ఈ పని చూస్తుంటే కచ్చితంగా కులాలను జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. గ్రామాల వారీగా కులాల జనాభాను ఇవ్వమని అడిగితే ఇవ్వటం లేదని.. దానికి తోడు కేంద్రం ఉపకులాల కాలం పెట్టమని చెబుతోందన్నారు. ఇది కచ్చితంగా బీసీల సంఖ్యను తక్కువ చేసే కుట్రే. కచ్చితంగా కుల గణనలో ఈ కాలం పెట్టాలని, ఇంకా నాలుగు నెలల కాలంలో కేంద్రం చేర్చాలని డిమాండ్ చేశారు. మ‌ల్కాజిగిరి ఎంపి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ… కులం లేకుండా రాజకీయాలు లేవని, మన దేశంలో ఒక కులం అన్ని రాష్ట్రాల్లో ఒకే కులంగా లేదన్నారు. దేశంలో అన్ని కులాలు ఏదో ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ అనుభవిస్తున్నాయని, కావాల్సింది రిజర్వేషన్లు కావు మనిషిని మనిషిగా చూసే మానవత్వం కావాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని సమగ్రంగా అమలు చేసే స్పిరిట్ ఉన్న నాయకుడు ఉంటేనే రాజ్యాంగ అమలు సంపూర్ణంగా జరుగుతుందన్నారు. పాలకులు ఎప్పుడూ ప్రజల కోసం రాయితీలు ఇవ్వరు .. పవర్ కోసం జరిగే ఘర్షణలో ఇచ్చే తాయిలాలు మాత్రమే అని అప్పుడే చెప్పారన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page