Saturday, October 17, 2026
No menu items!
Homedevotionalశ్రీ స‌ర‌స్వ‌తి దేవీ అలంకరణలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు

శ్రీ స‌ర‌స్వ‌తి దేవీ అలంకరణలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు

📰 Generate e-Paper Clip

క‌వాడిగూడ‌,  ( అద్దం న్యూస్ ) :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో అమ్మ‌వారిని శుక్ర‌వారం శ్రీ స‌ర‌స్వతి దేవీ రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ పంచామృతాభిషేకం, ఖ‌డ్గ‌మాలార్చ‌న‌, బాల‌భోగం, క‌ల‌శ‌స్థాప‌న‌, శ్రీ ల‌లితా స‌హ‌స్ర‌నామార్చాన‌, చంఢీ హోమం, మ‌హానివేద‌న మంత్ర‌పుష్ప‌ము, ప్ర‌త్యేక అలంక‌ర‌ణ ఉభ‌య‌దాత‌ల పూజ‌లు, హార‌తి మంత్ర పుష్ప‌ము ద్వార‌బంధ‌న‌ము త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ గోల్కొండ గౌత‌మ్ కుమార్, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి మ‌హేంద‌ర్ గౌడ్‌, ఆల‌య అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ, భ‌క్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page