Saturday, October 17, 2026
No menu items!
Homedevotionalశ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అలంక‌ర‌ణ‌

శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అలంక‌ర‌ణ‌

📰 Generate e-Paper Clip

చిక్క‌డ‌ప‌ల్లి,  ( అద్దం న్యూస్ ) :     ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మండ‌పంలో శుక్ర‌వారం అమ్మ‌వారిని శ్రీ స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు పెద్ద ఎత్తున హాజ‌రై స‌రస్వ‌తి దేవికి పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌న అధ్య‌క్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు పలుస బాల్‌రాజ్‌ గౌడ్, శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ, త‌మ్మ‌న కృష్ణ‌మూర్తి, రాప‌ర్తి రాజగోపాల్, కిరణ్ కుమార్‌, పెండ్యాల చంద‌ర్‌, రాప‌ర్తి వెంక‌ట ప్ర‌వీన్ కుమార్‌, రాజ్ కిర‌ణ్‌, నర్సింగ్ రావు, పాశం లక్ష్మణరావు, డి.చంద్రమోహన్ గౌడ్, పి.శివకృష్ణ, వీణా దేవి, అన్నపూర్ణ హాజ‌రై తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ ఆనంద పీఠాధ్య‌క్షులు, ఆత్మ‌బంధు ఆచార్య డాక్ట‌ర్‌.పులిగ‌డ్డ హ‌నుమంత‌రాయ శ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హంస అవార్డు గ్ర‌హీత‌లు నాగ‌రాజ శ‌ర్మ‌, మ‌యూర అవార్డు గ్ర‌హీతలు సాయినాథ శ‌ర్మ స‌హ‌కారంతో అమ్మ‌వారికి పూజ‌లు జ‌రిగాయి.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page