చిక్కడపల్లిలో ఘనంగా శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో బాలకిషన్ శర్మ పుట్టిన రోజుతో పాటు శ్రీ క్రిష్ణాష్టమి వేడుకల సందర్భంగా వినయ్ శర్మ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ హాజరై మైనంపల్లి ట్రస్ట్ ఛైర్మన్ బద్దం మోహన్‌రెడ్డితో కలిసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీష్ బాబు, లోకేష్, బాబురావు, బాలక్రిష్ణ యాదవ్, పవన్ చంద్ర, పిడిశెట్టి ప్రసన్న చంద్ర, పిడిశెట్టి విపిన్, పాండు, శివ, తరుణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply