Saturday, October 17, 2026
No menu items!
Homedevotionalశ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో అమ్మవారికి శ్రీ రుద్ర సహిత చండి హోమం

శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో అమ్మవారికి శ్రీ రుద్ర సహిత చండి హోమం

📰 Generate e-Paper Clip

క‌వాడిగూడ, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధి చెందిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవీ అలంకరణలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి శ్రీ రుద్ర సహిత చండిహోమాన్ని నిర్వ‌హించారు. ఈ హోమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ జి.గోల్కొండ గౌతమ్ కుమార్ ప‌టేల్‌, ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ పంచామృతాభిషేకం, ఖ‌డ్గ‌మాలార్చ‌న‌, బాల‌భోగం, క‌ల‌శ‌స్థాప‌న‌, శ్రీ ల‌లితా స‌హ‌స్ర‌నామార్చాన‌, చంఢీ హోమం, మ‌హానివేద‌న మంత్ర‌పుష్ప‌ము, ప్ర‌త్యేక అలంక‌ర‌ణ ఉభ‌య‌దాత‌ల పూజ‌లు, హార‌తి మంత్ర పుష్ప‌ము ద్వార‌బంధ‌న‌ము త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవీ అలంకరణలో క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ అమ్మ‌వారు

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page