రైల్వే పరిపాలన విభాగంలో స్టెనోగ్రాఫర్ల పాత్ర కీలకం  – డాక్టర్ ఎం.రాఘవయ్య

రైల్వే పరిపాలన విభాగంలో స్టెనోగ్రాఫర్ల పాత్ర కీలకం           – డాక్టర్ ఎం.రాఘవయ్య

ఘనంగా దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

సికింద్రాబాద్, జ‌న‌వ‌రి 7, అద్దం న్యూస్ :   స్టెనోగ్రాఫర్లు దైవంగా భావించే సర్ ఐజాక్ పిట్‌మన్ ( 04-01-1813 – 22-01-1897 ) స్మారకార్థం బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో ( ఆర్‌ఎస్‌సి )లో దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్ఎఫ్ఐఆర్‌/ ఎస్‌సిఆర్ఇఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.రాఘవయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ స్టేనోగ్రాఫర్లను సన్మానించారు. జోనల్ అధ్యక్షుడు టి.అనిల్ కుమార్, జోనల్ కార్యదర్శి జె.రామకృష్ణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.రాఘవయ్య వార్షిక సర్వసభ్య సమావేశంలో దశాబ్దాలుగా స్టెనోగ్రాఫర్ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు ప్రముఖ స్టెనోగ్రాఫర్లకు జీవితకాల సాఫల్య పురస్కార జ్ఞాపిక సన్మాన పత్రాన్ని ఈ సంద‌ర్భంగా అందజేసి సత్కరించారు.

స్టెనోగ్రాఫర్ల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, దేశ వ్యాప్తంగా రైల్వే పరిపాలన విభాగంలో స్టెనోగ్రాఫర్ల పాత్ర కీలకమన్నారు. ఆయా విభాగాలలో స్టెనోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page