T20 World Cup: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

T20 World Cup: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 మెగా టోర్నీలో పాల్గొనబోయే తమ దేశ జట్టును తాజాగా ప్రకటించింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ‘ఎక్స్‌’ వేదికగా బుధవారం ఉదయం పోస్ట్‌ చేసింది. ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య భారత్‌, శ్రీలంక వేదికగా జరగనుంది. దీనికంటే ముందు న్యూజిలాండ్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులోభాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుంది. టీ20 వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌ స్టేజిలో న్యూజిలాండ్‌.. ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా అఫ్గనిస్థాన్‌తో, ఫిబ్రవరి 10న అదే వేదికగా యూఏఈతో, ఫిబ్రవరి 14న అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 17న చెన్నై వేదికగా కెనడాతో తలపడనుంది.

న్యూజిలాండ్‌ జట్టు ఇదే..

మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), డెవన్‌ కాన్వే (వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ సీఫెర్ట్‌ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, జాకబ్‌ డఫీ, లూకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డారెల్ మిచెల్‌, ఆడమ్‌ మిలైన్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, ఇష్‌ సోధీ

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page