...

రాబోయే ఎన్నికల సమరానికి టిడిపి క్యాడర్‌ సన్నద్ధంగా ఉండండి  – టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

 రాబోయే ఎన్నికల సమరానికి టిడిపి క్యాడర్‌ సన్నద్ధంగా ఉండండి 
– టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్,  జూన్ 12, ( అద్దం న్యూస్ ) :  అంతర్గత విభేదాలు, వ్యక్తిగత గొడవలకు తావు లేకుండా, పార్టీలో నాయకులందరు సమిష్టిగా పనిచేస్తూ డివిజన్ స్థాయిలో పార్టీని గట్టిగా బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణా తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు, రాబోయే రోజుల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం హైదరాబాద్ దోమలగూడలోని నగర పార్టీ కార్యాలయంలో జరిగింది. టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల నుండి, స్థానిక నాయకుల నుండి తిరుపతి శ్రీవారి దర్శన టికెట్ల కోసం, లెటర్ల కోసం తీవ్రమైన డిమాండ్ ఉందనే విషయాన్ని సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఇక సంస్థాగత అంశాలపై, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) గురించి చర్చిస్తూ, ఓటర్ల వివరాలను సరిపోల్చే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం 52 శాతం పూర్తయిందని, మిగిలిన 48 శాతం ప్రక్రియను కూడా యుద్ధప్రాతిపదికన త్వరగా పూర్తి చేయాలని పలువురు నాయకులు తెలియజేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో అధిష్టానం, నారా చంద్రబాబు నాయుడు ముందు సీట్లు లేదా ప్రాధాన్యతలు ఆశించాలన్నా, మొదట క్షేత్రస్థాయిలో మన సత్తా నిరూపించుకోవాలనారు. ఇందుకు ప్రతి డివిజన్ నుండి కనీసం 25 నుండి 50 మంది యాక్టివ్ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ తరపున కనీసం 300 టికెట్లు ఇప్పించగలిగితే ప్రజల్లో క్యాడర్ ప్రతిష్ట పెరుగుతుందని, అయితే ఈ టికెట్లను కేవలం పార్టీ యాక్టివ్ మెంబర్‌షిప్ కలిగి ఉన్న వారికే ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణ, నిరంతర సమన్వయం ముఖ్యమని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం 38 డివిజన్లపై నాయకులు వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అరవింద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయ పొత్తు కుదిరితే, రాష్ట్రంలో పార్టీని నెంబర్ 2 స్థానంలో నిలబెట్టవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఓటర్లలో పార్టీ పట్ల నమ్మకాన్ని స్థిరపరచవచ్చని అన్నారు. గతంలో ఎవరి సహకారం లేనప్పటికీ, సొంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి “మినీ మహానాడు”ను విజయవంతం విధంగా, అదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను కూడా సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… ప్రతి 20 రోజులకు ఒకసారి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్లతో ( BLO ) నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేక ఫారాలను ఓటర్ల చేత భర్తీ చేయించి ఓట్లు గల్లంతు కాకుండా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి వారం స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి డివిజన్ లో తిరుగుతూ ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు పి.బాలరాజ్ గౌడ్, శ్రీపతి సతీష్, పి.అశోక్, జివిజి.నాయుడు, తడక వినోద్, శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, కరణం కిరణ్, కానూరు జయశ్రీ, బాలాజీ గోస్వామి, ఎం.నర్సింహ, వెంకటేష్ చౌదరి, గౌరీశంకర్, మహేందర్, రాజు నాయుడు, బోనాల శ్రీనివాస్, సి.విట్టల్, వీరబాబు, భవాని శ్రీనివాస్, డి.శ్రీనివాస్. వైఎల్.నర్సింహ గౌడ్, బాలరాజు యాదవ్, ఆనంద్, విక్రం, ఎల్.రవి, సత్తన్న, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.