బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న
టిడిపి నేత పలుస బాల్‌రాజ్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 9, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ బోనాల జాతరలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, చిక్కడపల్లి మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ… బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు అన్నపూర్న, వీణ, టిడిపి నాయకులు చంద్రమోహన్, శివకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply