Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రజా సమస్యలపై టీడీపీ సమర శంఖం – ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత ! " తెలుగుదేశం...

ప్రజా సమస్యలపై టీడీపీ సమర శంఖం – ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత ! ” తెలుగుదేశం – ప్రజాపథం ” 2 వ విడత ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” తెలుగుదేశం – ప్రజాపథం ” 2వ విడత కార్యక్రమం చిక్క‌డ‌ప‌ల్లి మాజీ కార్పోరేటర్ ప‌లుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ( వాల్మీకి అంబేద్కర్ ) వాంబే హౌసింగ్ భీమా మైదానం కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్, ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ నాయకులు నేరుగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోని, వాటి పరిష్కారం కొరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాల్లో భాగస్వాములయ్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, కొత్త రేషన్ కార్డుల జారీ, పంపిణీ వెంటనే చేపట్టాలని, అర్హులైన వారందరికు ఇళ్ల పట్టాల కేటాయించాలని, ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్‌ బాకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చూపుతున్న వివక్షపై మండిపడ్డారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారన్నారు. మాజీ కార్పొరేట‌ర్ పి.బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… కవాడిగూడ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లైన్లు, పాడైపోయిన సీసీ, బీటీ రోడ్లు, తీవ్రమైన నీటి ఎద్దడి, కరెంట్ కోతలు వంటి సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని ఈ కార్యక్రమంలో గుర్తించడం జరిగిందని అన్నారు.

ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ పాలన రావాలని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలోకి యువత చేరిక: తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా, యువ నాయకుడు రాజు బోయిన అతని అనుచరులకు పార్టీ నాయకులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎంకె.బోసు, కవాడిగూడ డివిజన్ నాయకులు ఎల్‌.రవి గౌడ్, ఎ.సత్తన్న, మగ్గి యాదగిరి, కడెం ఆనంద్ సహకరించగా, చంద్రమోహన్ గౌడ్, ఉదయ్ కుమార్ గుప్త, శంకర్ గౌడ్, బి.రాజు, భవాని శ్రీనివాస్, శక్తి ప్రేమ్, కట్ట రాములు, శ్యామ్ సుందర్ తడక వినోద్, కరణం కిరణ్, భాను ప్రకాష్, గుట్ట అనిల్ కురుమ, మశ్చీందర్, ఎ.విక్రమ్, ఎన్.సామ్యూల్, ఓ.వెంకటేష్ చౌదరి, కె. పరశురాం, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ఎం.రాజు, ఎం.బాబు, ప్రకాష్, రామకృష్ణ, డి.శ్రీనివాస్, జె.రాము, సాయి, ప్రశాంత్, విజయ్, ఎస్.మహేందర్, ఎస్.వినయ్, కె.సాయికుమార్, ఎస్.రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page