టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో భేటి అయిన తేజాగౌడ్
ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పై చర్చ
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజాగౌడ్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీరు పై చర్చించారు. ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పై, ప్రభుత్వం పై అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తదితర అంశాలపై చర్చించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తేజాగౌడ్‌కు టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సూచించారు. పార్టీని నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలన్నారు. పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని మహేష్‌గౌడ్ తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply