జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హోరెత్తిన ” తెలుగుదేశం ప్రజా పథం ”

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హోరెత్తిన
” తెలుగుదేశం ప్రజా పథం ”

జూబ్లీహిల్స్, జూలై 29, ( అద్దం న్యూస్ ) :  తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో బుధ‌వారం నిర్వహించిన ” తెలుగుదేశం ప్రజా పథం ” కార్యక్రమం ఘనంగా, ఉత్సాహంగా ప్రజాదరణతో జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివిజి.నాయుడు ఆధ్వ‌ర్యంలో శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు బాలరాజ్ యాదవ్, డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్య‌ర్థి మాధవి యాదవ్ లు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనగర్ కాలని డివిజన్‌లోని ఎల్లారెడ్డి గూడ ఆర్‌బిఐ క్వార్టర్స్ ఎదురుగా వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ ఎన్‌టిఆర్‌ విగ్రహనికి నివాళులు అర్పించి.. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్, మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్, రాష్ట్ర బిసి సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పి.అశోక్, రాష్ట్ర నాయకులు బంటు వెంకటేశ్వర్లు, రాజు నాయక్, అమర్నాథ్ బాబు, మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, నిమ్మగడ్డ సీతారత్నం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా డివిజన్‌లోని వివిధ ప్రధాన బస్తీలలో పాదయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ తిరుగుతూ స్థానిక ప్రజల కష్టసుఖాలను, ప్రతి నిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్రలో స్థానిక బస్తీవాసులు తమ దైనందిన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్రలో అర్హులైన పేద కుటుంబాలకు నేటికీ ఇందిరమ్మ ఇండ్లు దక్కలేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిలు అందకపోవడం విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేసారు. కాలనీల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, డ్రైనేజీ మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ తీవ్ర దుర్గంధం, రోగాల భారిన పడేలా చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి మహిళలకు ప్రతినెల ఇస్తామన్న ఆర్థికసాయం, పింఛన్లు అందక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సంద‌ర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… మెహదీపట్నం డివిజన్‌లోని ప్రతి బస్తీ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు అండగా నిలవడమే ఈ ‘ ప్రజా పథం ‘ ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను శుభ్రపరిచి, అర్హులకు సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… ప్రజలకు ఆకర్షణీయ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు, నేడు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని ధ్వ‌జ‌మెత్తారు. బస్తీల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,పేదలకు ఇండ్లు, మహిళలకు పింఛన్లు, విద్యార్థులకు స్కూటర్ల హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలాయని విమ‌ర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు తుమ్మల ఉమ, మహానంది, రాము యాదవ్, పడగల కృష్ణ, ఏబిఆర్ మోహన్ రావు, మహానంది, రాజు నాయుడు, జమీల్, సలీం, ప్రమీల, జాకబ్, అమ్మ శ్రీనివాస్, రాజేశ్వర్ ఠాకూర్, పి.శ్రీనివాస్ లతో పాటు పార్లమెంట్‌ నాయకులు తడక వినోద్, శ్యామ్ సుందర్, ఓ.వెంకటేష్ చౌదరి, పరుశు రామ్, కరణం కిరణ్, భాను ప్రకాష్, వివిధ నియోజకవర్గాల నాయకులు అనిల్, కాసుల సుదర్శన్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, ప్రసాద్, రామారావు, బి.రాజు, ఎండి.సలీమ్, విక్రమ్, బాలకృష్ణ, శక్తి ప్రేమ్, కవాడిగూడ బాబు, యాదగిరిలతో పాటు బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page