సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పీడిత తాడిత వర్గాలకు తీరని లోటు  – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, ఆగస్టు 24, అద్దం న్యూస్ :  గొప్ప సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామ్యవాది, మానవతావాది, శాంతి ప్రేమికుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పీడిత తాడిత వర్గాలకు తీరని లోటన్నారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఏం ఆర్ జి వినోద్ రెడ్డి, కెవియేల్ తో కలిసి హిమాయత్ నగర్ మఖ్ధూమ్ భవన్ లో కమ్యూనిస్ట్ దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… భారతదేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నా రాజకీయ గురువు సురవరం సుధాకర్ రెడ్డి అని అని అన్నారు. “దేశం గొప్ప సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామ్యవాది, మానవతావాది, శాంతి ప్రేమికుడిని కోల్పోయిందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలో స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం సమస్యను మొదట లేవనెత్తిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని, దేశ సంక్షేమం కోసం ప్రభుత్వం దానిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలు, రైతులు, కార్మికవర్గం, మహిళలు, యువత, విద్యార్థుల హక్కుల కోసం ఆయన అచెంచలమైన విధేయతతో అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అవిశ్రాంత కృషి, సామాజిక న్యాయం పట్ల దృఢ నిబద్ధత ఇప్పటికీ ఒక ప్రేరణగా నిలిచాయన్నారు.

 


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page