విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలి

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలి
– ష‌బ్బీర్ ఖాన్ హ‌స‌న్

ముషీరాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ ఏక్ మినార్ మసీదు నుండి కృష్ణాకాల‌ని కి వెళ్తున్న దారిలో 1-5-241/ఎ అడ్రస్ వద్ద ప్ర‌మాద‌క‌రంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడ నుండి తొలగించి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని స్థానికుడు షబ్బీర్ ఖాన్ హసన్ కోరారు. ఈ మేరకు ఆయన ముషీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ… 1-5-241/ఎ అడ్రస్ పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ వల్ల స్థానికంగా ఇబ్బందిగా ఉందని, మాటిమాటికి ఆ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుండి మంటలు వస్తున్నాయని తెలిపారు. ఆ అడ్రస్ లో శంకర్ అనే వ్యక్తికి కొంత భాగాన్ని 2021 నుండి అద్దెకు ఇవ్వడం జరిగిందన్నారు. అతను జిలేబి షాపును నడుపుతున్నాడన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుండి తరచు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రావడం అక్కడ పనిచేసే కార్మికులకు, వచ్చి పోయే ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా మారిందన్నారు. చుట్టుపక్కల ఉండే ఇళ్ల‌లోని ప్రజలు సైతం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ నుండి వచ్చే మంటల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

పలుమాలు అధికారులకు విన‌తి ప‌త్రాల‌ను అంద‌చేసినా వారు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని విమ‌ర్శించారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడ నుండి తరలించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా సంబంధిత అధికారులకు లేఖ రాశారని తెలిపారు. నివాసాలను అనుకోని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలని షబ్బీర్ ఖాన్ హసన్ అధికారులను కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page