చికెన్ షాపుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి
– బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ : చికెన్ షాపుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అన్నారు. తెలంగాణ చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బుధవారం జరిగిన మహాధర్నాలో పాల్గొని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ… పౌల్ట్రీ యాజమాన్యం చికెన్ షాప్‌లకు ఇచ్చే మార్జిన్ 30 నుండి 16 రూపాయలకు తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది చికెన్ షాపు నిర్వాహకులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించటం జరిగిందన్నారు. స్నేహ, సుగుణ, వెబ్ కాబ్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆధిపత్యంగా చేసుకుని చేస్తున్న ఈ స్టెరాయిడ్ కృత్రిమ చికెన్ తయారీ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చికెన్ షాపు నిర్వాహకులతో చర్చలు జరిపాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపు నిర్వాహకులు చేస్తున్న ఈ ఉద్యమంలో భాగస్వాములై ప్రజల్ని సమయత్తం చేస్తామని హెచ్చరించారు.![]()













Leave a Reply