TRS : నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల‌తో ప్రభుత్వం చర్చించాలి

ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి
నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల‌తో ప్రభుత్వం చర్చించాలి
» తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల‌తో ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం హైద‌రాబాద్‌ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తనను కలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని.. అయినా ఆయా హాస్పిటల్స్ లో పని చేసే సిబ్బందికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్లకు లేకపోవడం సరికాదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో చర్చించి వారికి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పని వేళలు, జీతాలు, ఓవర్ టైమ్ వంటి అంశాల్లో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి, నర్సులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page